Lifestyle

మసాలా దినుసులకు పురుగులు పట్టొద్దంటే ఏం చేయాలో తెలుసా

వర్షాకాలంలో మసాలాల సంరక్షణ

వర్షాకాలం మనకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ సీజన్ దుస్తులు త్వరగా ఆరవు, ఇళ్లంతా తేమగా ఉంటుంది. దుర్వాసన వస్తుంది. మసాలాలకు పురుగులు కూడా పడుతాయి.

తేమతో పాడయ్యే మసాలాలు

ఇండియాలో మసాలా దినుసులను బాగా ఉపయోగిస్తారు. కానీ వర్షాకాలంలో తేమ వల్ల మసాలా దినుసుల్లో పురుగులు, కీటకాలు తయారువుతాయి. 

మసాలాలు పాడవకుండా ఉండాలంటే..

పురుగుల వల్ల మసాలా దినుసులు పనికి రాకుండా పోతాయి. కానీ మీరు కొన్ని చిట్కాలను మసాలా దినుసులకు పురుగులు, కీటకాలు పట్టకుండా చేయొచ్చు. అదెలాగంటే? 

దాల్చినచెక్కతో

దాల్చిన చెక్కతో మసాలాలకు పురుగులు పట్టకుండా చేయొచ్చు. అవును దీన్ని మాసాలాల డబ్బాలో వేస్తే పురుగులు, కీటకాలు వాటి జోలికే రావు. దాల్చినచెక్కను సహజ కీటకనాశనిగా కూడా పిలుస్తారు. 

లవంగాలు

చక్కెరకు చీమలు పట్టొద్దంటే మీరు లవంగాలను వాడండి. చక్కెర డబ్బాలో 5-6 లవంగాలను వేయండి. దీని వాసనకు చీమలు దూరంగా ఉంటాయి. టీ పొడి, ఉప్పు తేమగా కాకుండా ఉండటానికి వీటిని ఉపయోగించొచ్చు.

మసాలాలు

మసాలా దినుసులను చాలా రోజులు నిల్వ ఉంచాలంటే అవి పొడిగా ఉండేట్టు చూసుకోండి. అలాగే వాటిని ఎప్పటికప్పుడు పొడి చేసి వాడండి. ఎక్కువ పొడి చేసి పెడితే అది తొందరగా పాడవుతుంది. 

చిన్న ప్యాకెట్లలో నిల్వ

మసాలాలు పాడవకుండా ఉండాలంటే వీటిని డబ్బాల్లో కాకుండా.. చిన్న చిన్న ప్యాకెట్లలో నిల్వ చేయండి. దీనివల్ల అవి గాలికి తగలకుండా ఉంటాయి. వీటిని వేయించి ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు. 

Find Next One