ఉదయం నడక వల్ల కండరాలు చురుగ్గా ఉంటాయి. ముఖ్యంగా కాళ్లు, పాదాలు బలంగా తయారవుతాయి.
నెమ్మదిగా నడవడం వల్ల మెదడుతో సహా శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
నెమ్మదిగా నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు అల్పాహారం తర్వాత నడవడం మంచిది.
ఉదయం గాలి స్వచ్ఛంగా ఉండటం వల్ల ఆ టైమ్ లో నడిస్తే ఊపిరితిత్తులకు ఆక్సిజన్ బాగా అందుతుంది. ఉదయం నడక శ్వాస వ్యాయామంలా కూడా పనిచేస్తుంది.
ఉదయం నడక వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉత్సాహాన్ని నింపుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
నెమ్మదిగా నడవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లనొప్పులు ఉన్నవారికి స్లోగా నడవడం మంచి వ్యాయామం.
నెమ్మదిగా నడవడం వల్ల కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడానికి నడక సహాయపడుతుంది.
సూర్యరశ్మిలో నడవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
లేవగానే లేదా అల్పాహారం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ప్రతిరోజూ నడవడం అలవాటు చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చు.
ఇవి తింటే మీ మెదడు డ్యామేజ్ అవ్వడం పక్కా
ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచిదా? కాదా?
ఒంటరితనంతో మానసిక ఆందోళన పెరుగుతుందా?
ఇలా చేస్తే జీవితంలో పెద్ద పేగు క్యాన్సర్ రాదు