చాలా మంది వాకింగ్ చేస్తారు. కానీ చాలా నెమ్మదిగా నడుస్తారు. దీని వల్ల ప్రయోజనం ఉండదు. మీరు నిజంగా బరువు తగ్గాలంటే చురుకుగా, వేగంగా నడవాలి. అప్పుడు కేలరీలు సులభంగా బర్న్ చేయగలం.
Image credits: Freepik
Telugu
ఎంత సేపు నడవాలి?
వారానికి ఐదు సార్లు కనీసం 30 నిమిషాలు నడవాలని గుర్తుంచుకోండి. అప్పుడే బరువు తగ్గడం సులభం అవుతుంది.
Image credits: Freepik
Telugu
మెట్లు ఎక్కడం కూడా..
మీ వాకింగ్ రొటీన్‌లో కొండలు, మెట్లు ఎక్కడం లాంటివి చేయడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలరు. అప్పుడు ఫ్యాట్ ని చాలా ఈజీగా కరిగించగలం.
Image credits: Freepik
Telugu
ఎన్ని అడుగులు వేస్తున్నారు?
ఫిట్‌నెస్ ట్రాకర్ లేదా స్టెప్-కౌంటింగ్ యాప్‌ని ఉపయోగించడం వల్ల మీరు మోటివేట్ అవుతారు. రోజుకు 8,000 నుండి 10,000 అడుగులు వేయడం లక్ష్యంగా పెట్టుకోండి.
Image credits: Freepik
Telugu
నడిచేటప్పుడు ఈ రూల్ ఫాలో అవ్వాలి..
వాకింగ్ మొదలు పెట్టినప్పుడు కాసేపు వేగంగా నడిచి, ఆ తర్వాత కాస్త స్లో చేయండి. ఉదాహరణకు 1–2 నిమిషాలు వేగంగా నడవండి, ఆపై 3–4 నిమిషాలు మళ్లీ నార్మల్ వేగంతో నడవండి.
Image credits: Freepik
Telugu
మ్యూజిక్ వింటూ వాకింగ్..
వాకింగ్ ద్వారా బరువు తగ్గడం అంతా స్థిరత్వం గురించి. దీన్ని ఆనందదాయకంగా చేసుకోండి.మ్యూజిక్ వింటూ వాకింగ్ చేయండి. అప్పుడు ఆనందంగా వాకింగ్ పూర్తి చేయగలరు.