Lifestyle
మామిడి పండ్లు తీయగా, అద్బుతంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. కానీ కొన్ని తప్పులు చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసా?
మామిడి గింజను కూడా ఉపయోగించొచ్చు. ఈ మామిడి గింజలను పానీయాలు, చట్నీల్లో ఉపయోగించొచ్చు తెలుసా? ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. మామిడి విత్తనాల్లో ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి.
మామిడిపండ్లను తినడానికి ముందు ఖచ్చితంగా కడగాలి. మామిడి పండ్లను సురక్షితంగా తినడానికి మామిడి పండ్లనే కాదు మీ చేతులను, పాత్రలను, కటింగ్ చేసే వాటిని కూడా కడగాలి.
మామిడిపండ్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కానీ వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిలో ఎక్కువ ఫైబర్, చక్కెర కంటెంట్ మీ కడుపుని చికాకుపెడుతుంది.
మామిడిలోని షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. ఈ చక్కెర పెరగకుండా ఉండేందుకు దీన్ని బాదంపప్పుతో కలిపి ఉదయం లేదా సాయంత్రం స్నాక్ గా తినొచ్చు.
మామిడి పండ్లను తప్పుగా కట్ చేయడం వల్ల పండ్లు వృధా అవుతాయి. అలాగే వీటిని తినడం కష్టతరం అవుతుంది. దీన్ని క్రిస్‌క్రాస్ నమూనాలో కట్ చేయండి. దీంతో మామిడి క్యూబ్‌లను తీయడం సులవవుతుంది.
మామిడి పండ్లను ఉదయం పూట తినడం మానుకోండి. ఎందుకంటే ఇది మీకు రోజంతా ఎక్కువ ఆకలిని కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది.
మామిడి జ్యూస్‌లు, షేక్‌లకు దూరంగా ఉండండ. ఎందుకంటే వీటిలో అదనపు చక్కెర, పాల పదార్థాలు ఉంటాయి. ఇవి మీ ఇన్సులిన్ స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి.