Lifestyle
వానాకాలంలో వాతావరణం తేమగా, చాలా చల్లగా ఉంటుంది. ఈ వాతావరణం మన ఆరోగ్యాన్నే కాదు జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలో జుట్టుకు నూనెను పెడితే..
వర్షాకాలం మొత్తం తలకు నూనెను రాసుకోవడం వల్ల చుండ్రు, ఇతర స్కాల్ఫ్ సమస్యలు తొలగిపోతాయి. జుట్టు షైనీగా కనిపిస్తుంది కూడా.
జుట్టుకు నూనెను రాయడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. అలాగే జుట్టును కండిషన్ కూడా చేయొచ్చు. తేమతో కూడిన ఈ వాతావరణం మీ జుట్టుకు హాని కలిగించకుండా నూనె కాపాడుతుంది.
వర్షాకాలంలో మీ జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. నీటితో ఎక్కువసేపు ఉండటం వల్ల మీ జుట్టులోని సహజ నూనెలు తగ్గిపోతాయి. గాలిలోని తేమ జుట్టును దెబ్బతీస్తుంది. నూనె పెడితే ఈ సమస్య ఉండదు.
జుట్టుకు నూనె రాయడం వల్ల తేమ, వర్షం హానికరమైన ప్రభావాలను నివారించొచ్చు, అలాగే వర్షాకాలంలోనూ హెయిర్ స్టైల్ చేయడం, నిర్వహించడం సులభం అవుతుంది.
వర్షాకాలంలో మీ జుట్టుకు కనీసం వారానికి రెండుసార్లు నూనె రాయడం మంచిది. ఎందుకంటే ఇది మీ జుట్టును ఆరోగ్యంగా, చిట్లిపోకుండా ఉంచుతుంది.
నూనెను జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు పెట్టాలి. ఇందుకోసం నూనెను గోరువెచ్చగా చేసి తలకు అప్లై చేసి కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి. 30 నుంచి 60 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
వర్షాకాలంలో జుట్టుకు నూనె రాసుకోవడం తప్పనిసరి మాత్రమే కాదు.. ఇది సాధారణంగా మీ జుట్టు సంరక్షణకు కూడా చాలా అవసరం.