Lifestyle
వానాకాలంలో నీటిని పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ.. మన శరీరానికి నీటి అవసరం ఎప్పుడూ ఉంటుంది. అందుకే మీకు రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి.
సూప్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీ సూప్ లో వివిధ రకాల కూరగాయలు, కాయధాన్యాలు, లీన్ మాంసాలు ఉండేట్టు చూసుకోండి. ఇవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
వానాకాలంలో అల్లం, హెర్బల్ టీలు, సూప్‌లు వంటి వివిధ కూడిన వెచ్చని పానీయాలను తీసుకోండి. ఎందుకంటే ఇవి మిమ్మల్ని వెచ్చగా ఉంచడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
మీ ఆహారంలో కేఫీర్, పెరుగు, పులియబెట్టిన కూరగాయలు వంటి ప్రోబయోటిక్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చండి. ప్రోబయోటిక్స్ గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
వానాకాలంలో స్ట్రీట్ ఫుడ్ ను అస్సలు తినకండి. ఇవి ఎంత టేస్టీగా ఉన్నా తినడం మానుకోండి. ఎందుకంటే వీటిని తింటే ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంది.
ఉల్లిపాయ, వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి సీజన్‌లో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
యాపిల్స్, దానిమ్మ, బెర్రీలు,నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతాయి.