Health
స్లీప్ అప్నియా
నిద్రలో శ్వాస సమస్యలను కలిగించే స్లీప్ అప్నియా వల్ల కూడా అలసట కలుగుతుంది. అంతేకాదు ఇది నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది
థైరాయిడ్
థైరాయిడ్ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వివిధ సమస్యలు కూడా అలసటకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.
రక్తహీనత
రక్తహీనత సమస్య చాలా మందిని వేధించే ప్రధాన సమస్య. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఇది అలసటకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ మెల్లిటస్
భారతదేశంలో టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. ఈ వ్యాధి కూడా అలసటకు దారితీస్తుంది.
చెడు జీవనశైలి
నీటిని తగినంత తాగకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, రెగ్యులర్ గా వ్యాయామం చేయకపోవడం వంటి జీవనశైలి కూడా అలసటకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.