Lifestyle

ప్రతిరోజూ బాదం పప్పులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Image credits: Image: Pexel

బలమైన జుట్టు

బాదంపప్పులో బయోటిన్ అనే విటమిన్ బి  ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంపప్పును తింటే మీ జుట్టు బలంగా, అందంగా మెరుస్తుంది. అలాగే మీ జుట్టును పొడుగ్గా పెంచుతుంది కూడా. 

Image credits: Pexel

యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్

బాదంపప్పుల్లో విటమిన్ ఇ ఉంటుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి. బాదంపప్పును తినడం వల్ల చర్మం ముడతలు, గీతలు తగ్గుతాయి.

Image credits: Image: Pexel

చర్మ ఆరోగ్యం

బాదంపప్పులు విటమిన్ ఇ, జింక్, మంచి కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలకు మంచి వనరు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చర్మ రంగును మెరుగుపరుస్తుంది. 

Image credits: Pexel

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

బాదంపప్పులో పుష్కలంగా ఉండే  విటమిన్ ఇ స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో మీ జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది. 

Image credits: Image: Pexel

గోర్ల ఆరోగ్యం

బాదంపప్పులో బయోటి, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గోర్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. బాదంపప్పును తింటే గోర్లు విరిగిపోయే ప్రమాదం తగ్గుతుంది. గోర్లు బలంగా మారుతాయి.
 

Image credits: Image: Pexel

హైడ్రేటెడ్ స్కిన్

బాదంపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ చర్మాన్ని మరింత మృదువుగా, తేమగా, పోషించడానికి, హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి.

Image credits: Google

ఆరోగ్యకరమైన చర్మం

బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇదొక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.

Image credits: Image: Pexel
Find Next One