Lifestyle

పరిగడుపున తినాల్సిన పండ్లు ఇవి..

పరిగడుపున కడుపుతో పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పోషకాల శోషణకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకోసం పరిగడుపున ఎలాంటి పండ్లను తినాలంటే? 

Image credits: our own

యాపిల్స్

యాపిల్స్ డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఖాళీ కడుపుతో యాపిల్స్ ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. 
 

Image credits: our own

బెర్రీలు

బెర్రీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పరిగడుపున బెర్రీలను తినడం వల్ల గుండె ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది.
 

Image credits: our own

పుచ్చకాయ

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పరిగడుపున దీన్ని తినడం వల్ల మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. రీఫ్రెష్ గా ఉంటారు. 
 

Image credits: our own

బొప్పాయి

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బొప్పాయిని పరిగడుపున తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించొచ్చు.
 

Image credits: our own

నారింజలు

నారింజలు విటమిన్ సి, ఫైబర్ కు అద్భుతమైన మూలం. పరిగడుపున నారింజను తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మీ శక్తిని పెంచుతుంది.

Image credits: our own

అరటిపండ్లు

అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి. ఈ పండులో పొటాషియం, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఈ పండ్లను తింటే అవి త్వరగా శక్తిని అందిస్తాయి.

Image credits: our own

ఈ అలవాట్లు మీ జుట్టును సిల్కీగా చేస్తాయి

రోజూ ఉదయం ఆరెంజ్ జ్యూస్ ను తాగితే ఎంత మంచిదో తెలుసా?

బీపీ ఎందుకు తగ్గుతుందంటే?

మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహారాలను తప్పకుండా తినండి