శరీరంలో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, వాటితో పోరాడేందుకు మన శరీరం ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని వల్ల రాత్రిపూట చెమటలు పడతాయి. ముఖ్యంగా టీబీ వ్యాధి ఉన్నవారికి ఈ చెమటలు ఎక్కువగా పడతాయి.
Image credits: Getty
Telugu
మెనోపాజ్ లేదా పెరిమెనోపాజ్
మహిళల్లో మెనోపాజ్ లేదా పెరిమెనోపాజ్ దశలో ఉన్నప్పుడు ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల శరీరంలో వేడి ఆవిర్లు (hot flashes) వచ్చి, రాత్రిపూట చెమటలు ఎక్కువగా పడతాయి.
Image credits: Getty
Telugu
క్యాన్సర్లు
లింఫోమా, లుకేమియా వంటి కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు కూడా రాత్రిపూట చెమటలు పడతాయి. అసాధారణ కణాలతో శరీరం పోరాడుతున్నప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది.
Image credits: freepik
Telugu
థైరాయిడ్ సమస్య
హైపర్‌థైరాయిడిజం ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి, శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా, రాత్రిపూట కూడా విపరీతంగా చెమటలు పడతాయి.
Image credits: Getty
Telugu
ఒత్తిడి, ఆందోళన
ఆందోళన, ఒత్తిడి లేదా పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) వంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది.దీని వల్ల కూడా చమటలు పడతాయి
Image credits: Pexels
Telugu
డయాబెటిస్ (మధుమేహం)
డయాబెటిస్ , ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో రాత్రిపూట చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవచ్చు . అప్పుడు శరీరం గ్లూకోజ్‌ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కూడా చమటలు పడతాయి
Image credits: Freepik
Telugu
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ (GERD)
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ (GERD) ఉన్నవారికి రాత్రిపూట కడుపులోని యాసిడ్ అన్నవాహికలోకి వస్తుంది. దీనివల్ల ఛాతీలో మంటతో పాటు చెమటలు పట్టడం కూడా జరుగుతుంది.