Telugu

బొప్పాయి తింటే ఈ జబ్బులకు చెక్ పెట్టొచ్చు

రోజూ బొప్పాయి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను మన నుంచి దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Telugu

జీర్ణ సమస్యలకు చెక్

బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది రకరకాల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, అజీర్తి వంటివి తగ్గుతాయి.
Image credits: Getty
Telugu

చర్మాన్ని కాపాడుతుంది

బొప్పాయిలో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ముడతలు వంటి వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బొప్పాయిలోని ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Image credits: Getty
Telugu

శరీరంలో వాపులను తగ్గిస్తుంది

బొప్పాయిలో లైకోపీన్, పపైన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడిని, శరీరంలోని వాపులను తగ్గిస్తాయి.
Image credits: Pinterest
Telugu

అధిక ఆకలిని కంట్రోల్ చేస్తుంది

బరువు తగ్గాలనుకునేవారికి బొప్పాయి బెస్ట్ ఆప్షన్. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది అతిగా ఆకలి వేయకుండా కంట్రోల్ చేస్తుంది.
Image credits: Pinterest
Telugu

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

నెలసరి సమయంలో బొప్పాయి తినడం వల్ల కడుపులో తిమ్మిర్లు, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
Image credits: Pinterest
Telugu

యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేస్తుంది

బొప్పాయిలో పపైన్, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. 

Image credits: Pinterest

Green Tea: రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది?

Gas Relief Tips: ఈ ఒక్క డ్రింక్‍తో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్య దూరం!

Ghee Benefits: పిల్లలకు రోజూ నెయ్యి ఎందుకు పెట్టాలో తెలుసా?

Clove Water: రోజూ లవంగాల నీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ పరార్!