Lifestyle
మిమ్మల్ని తమ వలలో వేసుకోవడానికి లేని ప్రేమను చూపించి ముగ్గులోకి దించడాన్ని లవ్ బాంబింగ్ అంటారు.
మీ గురించి పెద్దగా తెలియకుండా మొదట్లోనే ఎక్కువ ప్రేమ, శ్రద్ధ చూపిస్తుంటే ఒకసారి ఆలోచించాలి.
వివాహ, కుటుంబ సంబంధాల నిపుణురాలు లీనా స్టోకార్డ్ చెప్పిన ప్రకారం, ఎక్కువగా తోడుండాలనుకోవడం, వాత్సల్యం చూపించడం ఇవన్నీ కొన్నిసార్లు వలలో వేసుకునేందుకు ఉపయోగించే ప్రణాళికలే.
అవసరం లేకపోయినా బహుమతులు ఇవ్వడం, ఎప్పుడూ ఫోన్ చేస్తూ ఉండటం, ఎప్పుడూ శ్రద్ధ చూపిస్తూ ఉండటం ఇవన్నీ లవ్ బాంబింగ్ లక్షణాలే.
అలాగే మొదట్లోనే భవిష్యత్తులో కలిసి ఉంటామని చెప్పడం కూడా లవ్ బాంబింగ్ కావచ్చు.
ఎక్కువగా తోడుంటామని, ప్రేమిస్తామని నమ్మించి చివరికి మనల్ని వాడుకునే ఉద్దేశ్యంతో ప్రియుడు/ ప్రియురాలు మారే అవకాశం ఉంది. అదే లవ్ బాంబింగ్ ప్రత్యేకత.
కాబట్టి బాగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఎవరితోనైనా మానసికంగా దగ్గరవ్వడం మంచిది.