Lifestyle
మీరు 3D లుక్‌తో పింక్ కలర్‌లో ఫ్లవర్ కార్డ్‌లను తయారు చేసుకోవచ్చు. ఫ్లవర్ కటింగ్ కోసం మీరు యూట్యూబ్ వీడియో సహాయం తీసుకోండి. దానితో పాటు సూది, దారం వాడండి.
సన్ ఫ్లవర్, గులాబీ లాంటి పూలను 1 రోజు పాటు పుస్తకం మధ్యలో ఉంచి నొక్కి పెట్టండి. తర్వాత ఆ పువ్వును కార్డ్‌లో టేప్ సహాయంతో అతికించి మీ ఫెండ్స్ కు ఇవ్వొచ్చు.
పిల్లలు సీతాకోకచిలుక ఆకారంలో కాగితం కటింగ్ చేయడం ఇష్టపడతారు. వారిని గైడ్ చేస్తూ ఇలా అందమైన కార్డ్‌ని తయారు చేయించండి. మధ్యలో ఒక ఎన్వలప్ కూడా తయారు చేయండి.
విత్తనం నుండి పెరుగుతున్న మొక్క పెయింటింగ్ వేయండి. పక్కనే మీ టీచర్ కోసం అందమైన కోటేషన్ రాయండి. సింపుల్ లుక్‌తో తయారు చేసిన ఈ కార్డును టీచర్స్ డేకు మీ టీచర్ కి ఇచ్చి విష్ చేయండి.
టీచర్స్ డే కార్డ్ కోసం మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. హృదయాన్ని తాకే అందమైన కోటేషన్ రాసి మీ టీచర్‌కి ఇవ్వవచ్చు.
మీకు బాగా నచ్చిన వ్యక్తులకు కేవలం శుభాకాంక్షలే కాకుండా థ్యాంక్యూ కార్డులు కూడా ఇవ్వొచ్చు. టీచర్స్, తల్లిదండ్రులు, హెల్ఫ్ చేసిన ఫ్రెండ్స్ కు ఇలాంటి కార్డులు ఇవ్వొచ్చు.
ఈ కార్డు మేల్ పర్సన్స్ కు ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇలాంటివి ఇవ్వడం బాగుంటుంది. దానితో పాటు టీచర్‌కి నచ్చిన రంగు పెన్ను కూడా బహుమతిగా ఇవ్వండి.