Telugu

రాత్రి ఇలా చేశారంటే పాదాల పగుళ్లు ఉదయానికి మాయం

Telugu

కొబ్బరి నూనె

రాత్రి పడుకునే ముందు పాదాలకు కొద్దిగా కొబ్బరి నూనె రాసి కాసేపు మసాజ్ చేసుకోండి. ఇలా రోజూ చేస్తే పాదాల పగుళ్లు త్వరగా పోతాయి.

Image credits: Getty
Telugu

వాసెలిన్

ఒక స్పూన్ వాసెలిన్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపండి. పగుళ్లు ఉన్న చోట రాయండి. పావుగంట తర్వాత పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.

Image credits: our own
Telugu

కలబంద

కలబంద గుజ్జును పాదాల పగుళ్లపై రాసి మసాజ్ చేయాలి. అది ఆరిన తర్వాత చల్లటి నీటితో పాదాలను కడిగేయాలి.

Image credits: Getty
Telugu

గ్లిజరిన్, రోజ్ వాటర్

గ్లిజరిన్, రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మరసం కలిపి పాదాల పగుళ్లకు రాస్తే మంచిది. వారంలో రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Image credits: Getty
Telugu

నిమ్మరసం

పగుళ్లు ఉన్న చోట నిమ్మరసంతో మసాజ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది పాదాలపై ఉన్న మృతకణాలను, పొడి చర్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

అరటిపండు

బాగా పండిన అరటిపండును మెత్తగా పేస్ట్ చేసి పాదాల పగుళ్లపై రాయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. రాత్రి పూట ఇలా చేస్తే పాదాలు మృదువుగా మారతాయి.

Image credits: Getty
Telugu

పాదాలు పగుళ్లు రాకుండా

పాదాల పగుళ్లు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నీళ్లలో ఎక్కువ నానకూడదు. దుమ్మూ ధూళి, మట్టిలో ఎక్కు కాళ్లను ఉంచకూడదు.

Image credits: freepik

Bangle Designs: చేతలకు రాజసం ఉట్టిపడేలా యాంటిక్ గోల్డ్, ముత్యాల గాజులు

Swiggy : స్విగ్గీ ఆర్డర్స్ లో మన హైదరబాదీ వంటకమే టాప్.. ఏదో తెలుసా?

Pattu Sarees: మగువల మనసు దోచే బ్యూటిఫుల్ పట్టు చీరలు.. చూస్తే ఫిదా!

Jhumka Designs: పట్టుచీరలకు మ్యాచింగ్ గోల్డ్ జుంకాలు..ఎంత బాగున్నాయో