మూత్రం రంగు గోధుమ రంగు, ముదురు పసుపు, గులాబీ రంగులోకి మారడం కిడ్నీల సమస్య ఉందనడానికి సంకేతంగా చెప్పుకోవాలి.
మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం కిడ్నీ వ్యాధికి ప్రధాన సంకేతం.
మూత్రం పరిమాణం చాలా తగ్గడం, లేదా అతిగా పెరగడం కూడా కిడ్నీల సమస్యను సూచిస్తుంది.
కిడ్నీ పనితీరు సరిగా లేకపోతే కాళ్లు, చేతులు, కళ్ల కింద, ముఖం మీద వాపు కనిపిస్తుంది.
కిడ్నీలు పనిచేయనప్పుడు శరీరంలోని వ్యర్థాలు, లవణాలు రక్తంలో పేరుకుపోతాయి. ఇది చర్మ సమస్యలు, దురదకు కారణం కావచ్చు.
కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారికి అలసట, బలహీనత ఎక్కువగా కనిపిస్తాయి.
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
సంక్రాంతికి ఈ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి.. లుక్ అదిరిపోద్ది
అన్ని వయసులవారికి చక్కగా సరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవిగో
నిమ్మకాయతో సులువుగా శుభ్రం చేసే ట్రిక్స్
మాంసం ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే