Telugu

Pimples Remove: ఇదొక్కటి వాడితే రాత్రికి రాత్రే మొటిమలు మాయం

Telugu

మొటిమలు గిల్లకూడదు

మొటిమలు వస్తే చాలు గిల్లేస్తుంటారు. దానివల్ల మచ్చలు, చీము కారడం జరిగి…ఇంకాస్త పెద్ద మచ్చలు వస్తాయి. చూడటానికి ముఖం అసహ్యంగా ఉంటుంది. అందుకే ఎక్కువ కష్టపడకుండా ఇది ట్రై చేయండి.

Image credits: Getty
Telugu

అసలేంటి ఈ పింపుల్ ప్యాచ్?

మొటిమలు పోవాలంటే ఈ సింపుల్ ప్యాచ్ ట్రై చేయండి.  చూడటానికి స్టిక్కర్లలా కనిపిస్తాయి. వీటిని మొటిమల్లోని చీము, మురికి పీల్చుకోవడానికి హైడ్రోకొల్లాయిడ్  అనే పదార్థంతో తయారు చేస్తారు.

Image credits: Asianet News
Telugu

బ్యాక్టీరియా నుంచి రక్షణ

మొటిమ మీద ఈ ప్యాచ్ అంటించడం వల్ల బయటి నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా ఉంటుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ కూడా తగ్గుతుంది.

Image credits: Asianet News
Telugu

చేత్తో గిల్లడం ఆపేయొచ్చు

మొటిమలను గోళ్లతో గిల్లడం చాలామందికి అలవాటు. అలాంటి వారికి ఈ ప్యాచ్ పనిచేస్తుంది. దీనివల్ల మచ్చలు పడకుండా ఉంటాయి.

Image credits: Asianet News
Telugu

ఒక్క రాత్రికే ఫలితం

రాత్రి పడుకునే ముందు మొటిమ మీద ఈ ప్యాచ్ అంటించుకుంటే చాలు. ఉదయం లేచేసరికి మొటిమలోని వాపు, చీమును ప్యాచ్ పీల్చేసుకుంటుంది.

Image credits: Asianet News
Telugu

ఇలా వాడాలి

ముఖం శుభ్రంగా కడుక్కుని, ఆరబెట్టుకోవాలి. తర్వాత క్రీములు లేదా లోషన్లు రాయడానికి ముందే, నేరుగా మొటిమ మీద ప్యాచ్ అంటించాలి.

Image credits: Getty
Telugu

మందుతో కూడిన ప్యాచెస్

కొన్ని ప్యాచెస్‌లో సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ వంటివి ఉంటాయి. ఇవి మొండి మొటిమలను కూడా త్వరగా తగ్గించడానికి సాయపడతాయి.

Image credits: Asianet News
Telugu

మేకప్ కింద కూడా వాడొచ్చు

చాలా ప్యాచెస్ చర్మంలో కలిసిపోయేలా, కనిపించకుండా ఉంటాయి. కాబట్టి మేకప్ వేసుకునే ముందు వీటిని అంటిస్తే మొటిమ కనిపించదు, అదే సమయంలో స్కిన్ సేఫ్‍గా ఉంటుంది.

Image credits: Asianet News

Face Wash: ఏ స్కిన్ వారు ఎలాంటి ఫేస్ వాష్ వాడాలో తెలుసా?

Bangles: చేతుల అందాన్ని పెంచే రంగురంగుల ప్లాస్టిక్ గాజులు ఇవిగో!

Gold Ring: 1 గ్రాము బంగారంలో అదిరిపోయే ఉంగరాలు

Silver Mangalsutra: రూ.వెయ్యి కే లభించే వెండి మంగళసూత్రాలు