Telugu

Face Wash: ఏ స్కిన్ వారు ఎలాంటి ఫేస్ వాష్ వాడాలో తెలుసా?

Telugu

ఆయిల్ స్కిన్ ఉన్నవారికి...

జిడ్డు చర్మం ఉన్నవారు ఫోమింగ్ ఫేస్ వాష్ లు బెస్ట్. ఇవి చర్మంపై ఉండే అదనపు నూనె, మురికిని తొలగించి.. ముఖానికి తాజాదనాన్ని అందిస్తాయి. 

Image credits: Asianet News
Telugu

పొడి చర్మం కోసం క్రీమ్ బేస్డ్

పొడి చర్మం ఉన్నవాళ్లు క్రీమ్ లేదా లోషన్ రూపంలో ఉండే ఫేస్‌వాష్‌లు వాడాలి. ఇవి చర్మంలోని తేమను నిలిపి ఉంచడంలో సహాయపడతాయి.
Image credits: Asianet News
Telugu

కాంబినేషన్ స్కిన్‌కు జెల్ బేస్డ్

కొంత ఆయిలీగా, కొంత డ్రైగా ఉండే కాంబినేషన్ స్కిన్‌కు జెల్ ఆధారిత క్లెన్సర్లు మంచివి. ఇవి చర్మాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతాయి.
Image credits: Asianet News
Telugu

సెన్సిటివ్ స్కిన్‌కు సురక్షితమైనవి

సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. సువాసన, ఆల్కహాల్ లేని ఫేస్‌వాష్‌లను మాత్రమే ఉపయోగించాలి. లేదంటే చర్మం ఎర్రబడటం, దురద వంటి సమస్యలు వస్తాయి.
Image credits: Asianet News
Telugu

మొటిమల సమస్య ఉంటే మెడికేటెడ్

మొటిమలతో బాధపడేవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ ఉన్న ఫేస్‌వాష్ ఎంచుకోవాలి. ఇది మొటిమలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
Image credits: Asianet News
Telugu

pH లెవెల్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి

చర్మం సహజమైన pH స్థాయిని కాపాడే ఫేస్‌వాష్‌లను వాడటం చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Image credits: Asianet News
Telugu

ట్రై చేయడానికి చిన్న ప్యాక్ కొనండి

కొత్త ఫేస్‌వాష్ కొనేటప్పుడు, ముందుగా చిన్న ప్యాక్ కొని ప్రయత్నించండి. మీ చర్మానికి ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్న తర్వాతే పెద్ద ప్యాక్ కొనడం మంచిది.
Image credits: Asianet News

Bangles: చేతుల అందాన్ని పెంచే రంగురంగుల ప్లాస్టిక్ గాజులు ఇవిగో!

Gold Ring: 1 గ్రాము బంగారంలో అదిరిపోయే ఉంగరాలు

Silver Mangalsutra: రూ.వెయ్యి కే లభించే వెండి మంగళసూత్రాలు

Blue Stone Anklet: నీలి రాళ్లతో మెరిసే పట్టీలు.. పాదాలకు రాయల్ లుక్