Lifestyle

కూరగాయలు కట్ చేస్తే కత్తికి, ఇలా పదును పెట్టండి

కత్తికి పదును తగ్గిందా?

ఎంత మంచి కత్తి అయినా వాడగా, వాడగా పదును తగ్గుతుంది. అప్పుడు కూరగాయలు తరగడం కష్టమౌతుంది. అప్పుడు దానికి పదును పెట్టడం చాలా ాఅవసరం.

 

 

కప్పుతో కత్తికి పదును

మీ ఇంట్లో టీ తాగడానికి సెరామిక్ కప్పులు ఉండే ఉంటాయి. ఈ కప్పులను తిరగేసి దానిపై చాకును రుద్దండి, ఇలా చేయడం వల్ల దాని పదును పెరుగుతుంది.

స్క్రబ్బర్ తో పదును

మీరు పాత్రలు తోమడానికి స్టీల్  స్క్రబ్బర్‌ని వాడుతుంటే..  దానిపై మీరు చాకును రుద్దండి. ఇలా చేయడం వల్ల దాని పదును పెరుగుతుంది.

రాయిని వాడండి

మీ దగ్గర పెద్ద రాయి లేదా రోలు ఉంటే, మీరు దానిని చాకు పదును పెట్టడానికి ఉపయోగించవచ్చు. దానిపై 1 నిమిషం పాటు చాకును వేగంగా రుద్దండి.

కార్డ్‌బోర్డ్‌ని వాడండి

కార్డ్‌బోర్డ్‌ని ఉపయోగించి కూడా మీరు చాకును పదును పెట్టుకోవచ్చు. కార్డ్‌బోర్డ్ ముక్కపై చాకును నెమ్మదిగా రుద్ది దాని పదును పెంచండి.

లెదర్ బెల్ట్

మీ దగ్గర పాత లెదర్ బెల్ట్ ఉంటే, లెదర్ సహాయంతో కూడా మీరు చాకుకు పదును పెట్టవచ్చు. లెదర్ బెల్ట్‌పై చాకు కొనను రుద్దండి. 1 నిమిషం పాటు ఇలా చేస్తే దాని పదును పెరుగుతుంది.

నైలాన్ స్ట్రిప్

స్కూల్ బ్యాగ్ లేదా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో నైలాన్  పొడవైన స్ట్రిప్ ఉంటుంది. మీరు ఈ స్ట్రిప్‌పై చాకును రుద్దండి. ఇలా చేయడం వల్ల దాని పదును పెరుగుతుంది.

Find Next One