Woman
ప్రతిరోజూ మనం టూత్ పేస్ట్ ను పళ్లు తోముకోవడానికి ఉపయోగిస్తాం.కానీ దీనితో ఇంటిని శుభ్రం చేయొచ్చు. బట్టలకున్న మరకలను పోగొట్టొచ్చు తెలుసా?
టూత్‌పేస్ట్‌తో ఎలాంటి మొండి మరకలను జస్ట్ రెండు నిమిషాల్లో లేకుండా చేయొచ్చు.
మన ఫోన్ కవర్ కు దుమ్ము, దూళి, మురికి అంటుకుంటాయి. అయితే టూత్‌పేస్ట్ ను బ్రష్ కు పెట్టి ఫోన్ కవర్ ను ఈజీగా క్లీన్ చేయొచ్చు.
దుస్తులకు అంటిన లిప్ స్టిక్ మరకలు అంత సులువుగా పోవు. అయితే ఈ మరకలను టూత్ పేస్ట్ చాలా ఈజీగా పోగొడుతుంది. మరకపై టూత్‌పేస్ట్‌ను పెట్టి తడిగుడ్డతో తుడవండి.
టీ, కాఫీ మరకలు దుస్తులకు అంటినా, గోడలకు అంటినా అస్సలు పోవు. కానీ టూత్ పేస్ట్ తో ఈజీగా పోగొట్టొచ్చు. ఇందుకోసం మరకపై టూత్‌పేస్ట్‌ను పెట్టండి.
సింక్‌లో ఉండే మొండి మరకలను పోగొట్టడానికి కూడా మీరు టూత్ పేస్ట్ ను ఉపయోగించొచ్చు.
ఐరన్ బాక్స్‌పై పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్ కూడా బాగా ఉపయోగపడుతుంది.