రాగి పిండి - 1.5 కప్పులు, నీళ్లు - 4 కప్పులు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర, కరివేపాకు - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - కాల్చడానికి.
Image credits: Getty
Telugu
స్టెప్-1
ఒక గిన్నెలో రాగి పిండి తీసుకోండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండి జారుడుగా ఉండాలి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి.
Image credits: Pinterest
Telugu
పది నిమిషాల్లో దోశ..
అన్ని పదార్థాలు కలిపిన తర్వాత, ఈ పిండిని 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల దోశలు బాగా వస్తాయి.
Image credits: Pinterest
Telugu
స్టెప్-4
వేడి పెనంపై నూనె రాసి, పిండిని పోయాలి. దోశ క్రిస్పీగా అయ్యేవరకు కాల్చాలి. ఒకవేళ దోశ సరిగ్గా రాకపోతే, పిండిలో 1-2 చెంచాల బియ్యం పిండి కలుపుకుంటే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
రాగి దోశకు కాంబినేషన్..
అంతే, వేడివేడి రాగి దోశ రెడీ. దీన్ని సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.