Telugu

Moringa Halwa : ఈ హల్వా తింటే చాలు..నీరసం కూడా నీరులా కరిగిపోతుంది

Telugu

మునగాకు హల్వా

మునగాకుతో కూర, పరోటా, పకోడీ లాంటివి మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ గురించి తెలుసుకుందాం. అదే మునగాకు హల్వా. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

స్టెప్ 1

ముందుగా లేత మునగాకును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పెట్టుకోండి. ఆకుల్లో చిన్న చిన్న కాడలు లేకుండా చూసుకోండి.

Image credits: Getty
Telugu

స్టెప్ 2

ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి మునగాకును బాగా ఉడికించండి. పది నిమిషాల తర్వాత నీటిని వంపేసి, ఆకులను మాత్రమే మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా పట్టుకోండి.

Image credits: AI
Telugu

స్టెప్ 3

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేయండి. అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మునగాకు పేస్ట్ వేసి బాగా కలపండి.

Image credits: Getty
Telugu

స్టೆప్ 4

హల్వా చేసేటప్పుడు మంటను సిమ్‌లో ఉంచడం మర్చిపోవద్దు. మునగాకు పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో బాగా కలుపుతూనే ఉండాలి.

Image credits: social media
Telugu

స్టెప్ 5

ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు, మీ రుచికి సరిపడా చక్కెర వేసి ఉడికించండి. పాలు, చక్కెర బాగా కలిసి మిశ్రమం దగ్గరపడే వరకు కలుపుతూనే ఉండాలి.

Image credits: AI
Telugu

స్టెప్ 6

చివరగా ఈ మిశ్రమంలో యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయండి. ఇవి హల్వా రుచిని మరింత పెంచుతాయి.

Image credits: Asianet News
Telugu

వేడి వేడిగా సర్వ్ చేయండి

అంతే, ఎంతో రుచికరమైన మునగాకు హల్వా రెడీ. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేయండి. చల్లారాక తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజే ట్రై చేయండి!

Image credits: Getty

Sarees: కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించేందుకు బెస్ట్ శారీస్ డిజైన్లు

Gold Earrings: డైలీవేర్ కి తక్కువ బడ్జెట్ లో వచ్చే బంగారు కమ్మలు ఇవిగో

Bridal Set: పెళ్లిళ్లకు అదిరిపోయే కంప్లీట్ బ్రైడల్ సెట్.. చూసేయండి

Gold Jewellery: పట్టు చీరలతో ఈ జ్యువెలరీ వేసుకుంటే అందరి చూపు మీవైపే!