కరివేపాకు కొమ్మతో కొత్త మొక్కను కుండీలో ఇలా పెంచేయండి
life Mar 31 2026
Author: Haritha Chappa Image Credits:Getty
Telugu
సరైన కొమ్మను ఎంచుకోండి
కరివేపాకు మొక్కను పెంచడానికి వేళ్లతో కూడిన మొక్కే అవసరం లేదు. కరివేపాకు కొమ్మ వాడితే చాలు. అది మరీ లేతగా ఉండకూడదు, అలా అని మరీ ముదురుగా, గట్టిగా ఉండకూడదు.
Image credits: Getty
Telugu
మట్టిని సిద్ధం చేయండి
నీరు సులభంగా పోయేలా గుల్లగుల్లగా ఉండే మట్టిని వాడాలి. మట్టి, కోకోపీట్ కలిపి మిశ్రమంలో కొమ్మను నాటడం చాలా మంచిది.
Image credits: Getty
Telugu
కొమ్మ ఎండిపోకుండా
మట్టిలో నాటిన కొమ్మను ప్లాస్టిక్ కవర్ కట్టాలి. ఇది ఒక చిన్న గ్రీన్‌హౌస్‌లా పనిచేస్తుంది. కొమ్మ ఎండిపోకుండా కాపాడుతూ, వేర్లు వేగంగా పెరిగేందుకు సాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ఎండ వద్దు
మట్టిలో పాతిన కొమ్మను నేరుగా ఎండలో ఉంచకూడదు. తగినంత వెలుతురు వస్తే చాలు. దీని నుంచి వేర్లు రావడానికి సాధారణంగా 3 నుంచి 4 వారాలు పట్టొచ్చు.
Image credits: Getty
Telugu
కొంచెం కష్టమే
కొమ్మ ద్వారా మొక్కను పెంచే పద్ధతి కష్టమే కానీ అసాధ్యం కాదు, దీని సక్సెస్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే ఒకేసారి నాలుగైదు కొమ్మలను నాటితే మంచిది.
Image credits: Getty
Telugu
జాగ్రత్త అవసరం
కొమ్మల నుంచి కరివేపాకు పెంచేందుకు రెండు మూడు సార్లు ప్రయత్నించండి. కచ్చితం ఒకసారి సక్సెస్ అవుతుంది.
Image credits: Getty
Telugu
కుండీలో కరివేపాకులు
కుండీలోనే కరివేపాకు మొక్కను చాలా సులువుగా పెంచుకోవచ్చు.