Lifestyle
కళ్ల చుట్టూ ఉన్న నల్ల మచ్చలను పోగొట్టడానికి ఎలాంటి ఇంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కీరదోసకాయను గుండ్రంగా కట్ చేసి కనురెప్పల మీద పెట్టండి. ఇది కళ్ల చుట్టూ ఉన్న నల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది.
బంగాళాదుంపలను తరిగి లేదా గుండ్రంగా గ్రైండ్ చేసి కనురెప్పలపై 10 నిమిషాలు పెట్టండి. కొద్దిసేపటి తర్వాత కళ్లను కడిగేయండి.
కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను వదిలించడంలో కలబంద జెల్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే డార్క్ సర్కిల్స్ ఉంటే కళ్ల చుట్టూ కలబంద జెల్ ను అప్లై చేయండి.
రెండు టీస్పూన్ల కాఫీ పొడిలో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె వేసి కలిపి కళ్ల చుట్టూ అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి.
టమాటా జ్యూస్ ను కళ్ల చుట్టూ అప్లై చేసి తర్వాత కడిగేసుకుంటే డార్క్ సర్కిల్స్ పోతాయి.
వాడిన టీ బ్యాగ్ ను కాసేపు ఫ్రిజ్ లో పెట్టి, కనురెప్పలపై పదినిమిషాలు ఉంచండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నలుపు తొలగిపోతుంది.