ఒక్క ముఖమే కాదు పాదాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. అప్పుడే పాదాల పగుళ్లు రావు.
Image credits: Getty
క్లీనింగ్
మీ పాదాలను శుభ్రంగా ఉంచడానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే?
Image credits: Getty
పాదాలకు మాయిశ్చరైజర్
మీరు స్నానం చేసిన వెంటనే పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేయండి. పాదాలు హైడ్రేటెడ్ గా ఉంటే పగుళ్లు రాకుండా అందంగా ఉంటాయి.
Image credits: Getty
శనగపిండి, పెరుగు, రోజ్ వాటర్
శనగపిండి, పెరుగు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేయండి. ఈ ప్యాక్ ను పాదాలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ మీ కాళ్లను అందంగా మారుస్తుంది.
Image credits: Getty
పసుపు
పసుపును పాదాలకు అద్భుతమైన స్క్రబ్ గా ఉపయోగించొచ్చు. పాలు, పసుపు కలిపి పాదాలకు అప్లై చేయండి. ఇది ఆరిన తర్వాత కడిగేయండి.
Image credits: Getty
వేప ఆకులు
వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప నీటిలో పాదాలను నానబెట్టి 20 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తే అందంగా తయారవుతాయి.
Image credits: Getty
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే మీ కాళ్లు సున్నితంగా, అందంగా తయారవుతాయి.