Telugu

పిల్లల్లో రోగనిరోధక శక్తి

వర్షాకాలంలో పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లల రోగనిరోధక శక్తిని పెంచితే వారికి వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

Telugu

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

రోగనిరోధక శక్తిని పెంచడంలో కొన్ని ఆహారాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 
 

Image credits: Getty
Telugu

రాగులు

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు కొన్ని రోజులు వారి భోజనంలో వీటిని చేరిస్తే వారి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రాగులను పుట్టి లేదా దోశగా ఇవ్వొచ్చు.
 

Image credits: Getty
Telugu

గింజలు

నట్స్ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

 

Image credits: Getty
Telugu

సార్డినెస్

పిల్లలకు సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలను ఇవ్వాలి. ఎందుకంటే దీనిలో ఉండే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

బెర్రీలు

 

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి  రకరకాల బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty
Telugu

బ్రోకలీ

బచ్చలికూర, పాలకూర , బ్రోకలీ వంటి కూరగాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది.  బలమైన గట్ మైక్రోబయోమ్ బలమైన రోగనిరోధక వ్యవస్థతో నేరుగా సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

Image credits: Getty
Telugu

సిట్రస్ పండ్లు

నిమ్మకాయ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 

Image credits: Getty
Telugu

అల్లం

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్న అల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

రాత్రి బాగా నిద్రపోవాలనుకుంటే వీటిని మాత్రం తినకండి?

ఏవి తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది

కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాలు ఇవి..

కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో తెలుసా?