Telugu

Pedicure: ఒక్క పెడిక్యూర్ తో శరీరంలో సమస్యలన్నింటికీ చెక్..

Telugu

Pedicure: పెడిక్యూర్‍తో ఇన్ని లాభాలా? ఈ 7 బెనిఫిట్స్ గ్యారెంటీ

పెడిక్యూర్ అంటే కేవలం పాదాల అందం మాత్రమే కాదు. దానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనసుకు ప్రశాంతతనివ్వడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. 

Image credits: Asianet News
Telugu

మృతకణాలను తొలగిస్తుంది

పెడిక్యూర్ చేయడం వల్ల పాదాలపై పేరుకుపోయిన మృతకణాలను సులభంగా తొలగించవచ్చు. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి.
Image credits: Asianet News
Telugu

రక్తప్రసరణ మెరుగుపడుతుంది

పెడిక్యూర్ చేసేటప్పుడు పాదాలకు మసాజ్ చేస్తారు. ఈ మసాజ్ వల్ల పాదాల్లో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కండరాలకు కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.
Image credits: Asianet News
Telugu

పాదాలకు తేమను అందిస్తుంది

పెడిక్యూర్‌లో రకరకాల నూనెలు, లోషన్లు వాడతారు. వీటివల్ల పాదాల చర్మం పొడిబారకుండా ఉంటుంది. సహజమైన తేమ నిలిచి ఉంటుంది.
Image credits: Asianet News
Telugu

సమస్యలను ముందే గుర్తించవచ్చు

రెగ్యులర్‌గా పెడిక్యూర్ చేయించుకుంటే పాదాల్లో ఏవైనా చిన్న చిన్న గడ్డలు, వాపులు లేదా ఇతర మార్పులు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. సమస్యను మొదట్లోనే పసిగట్టొచ్చు.
Image credits: Asianet News
Telugu

శరీర సమతుల్యతను కాపాడుతుంది

ఆరోగ్యకరమైన పాదాలు ఉంటేనే శరీరం బ్యాలెన్స్‌గా ఉంటుంది. నొప్పి లేకుండా హాయిగా నడవాలన్నా పాదాల ఆరోగ్యం చాలా ముఖ్యం.
Image credits: Asianet News
Telugu

ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది

గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. గోరు చుట్టు వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.
Image credits: Asianet News
Telugu

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది

పెడిక్యూర్ చేసేటప్పుడు గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచుతారు. ఆ తర్వాత చేసే మసాజ్ మనసును ప్రశాంతంగా మారుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది.
Image credits: Asianet News

Vastu Tips: ఇంట్లో ఈ ఫొటోను ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?

Nail Art: బ్రైడల్ నెయిల్ ఆర్ట్.. మెహెందీ చేతులకు మరింత అందం

Foods for Hair: జుట్టు ఒత్తుగా పెరిగేందుకు తినాల్సిన 7 ఆహారాలు

Nose Rings: అరగ్రాములో వచ్చే బంగారు ముక్కపుడకలు