ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం పెద్దగా ఉండే బంగాళదుంపలు వాడాలి. ఇలాంటి దుంపలతో ఫ్రైస్ బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా వస్తాయి.
బంగాళదుంపల తొక్క తీసి ఒకే మందంతో పొడవుగా కట్ చేయండి. ముక్కలన్నీ ఒకేలా ఉంటే ఫ్రైస్ సమానంగా వేగుతాయి. ముక్కలు లావుగా ఉంటే లోపల మెత్తగా, బాగా క్రిస్పీగా వస్తాయి.
కట్ చేసిన ముక్కల్ని చల్లటి నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. నీళ్లు తెల్లగా మారితే, ఆ నీటిని మార్చి మళ్లీ నానబెట్టండి. అదనపు స్టార్చ్ పోతుంది. అప్పుడు ఇవి క్రిస్పీగా వస్తాయి.
ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో ఉప్పు, 1 టీస్పూన్ వెనిగర్ వేయండి. బంగాళదుంప ముక్కల్ని 5-6 నిమిషాలు ఉడికించండి. దీనివల్ల లోపల మెత్తబడి, బయట విరగకుండా వస్తాయి.
ఉడికించిన బంగాళదుంపల్ని వడకట్టి, శుభ్రమైన గుడ్డపై లేదా టిష్యూపై పరచండి. కనీసం 10-15 నిమిషాలు ఆరనివ్వండి. తడి దుంపలు నూనెను పీల్చుకుంటాయి. పొడి దుంపలు క్రిస్పీగా వస్తాయి.
మధ్యస్థ మంటపై నూనె వేడి చేసి బంగాళదుంప ముక్కల్ని కొద్దికొద్దిగా వేసి వేయించండి. మొదటిసారి వేయించాక ఫ్రైస్‌ను చల్లారనివ్వండి. తర్వాత నూనెను బాగా వేడి చేసి మళ్లీ వేయించండి.
టమాటా కెచప్ తో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే రుచి అదిరిపోతుంది. పిల్లలకు ఇవి ఎంతో ఇష్టం.