Telugu

ఇలా చేస్తే మీ పాదాల పగుళ్లు ఇట్టే మాయమవుతాయి !

Telugu

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. రాత్రి పూట పాదాలకు పట్టించి మర్దనా చేసి, సాక్స్ వేసుకుని పడుకోండి.

Telugu

తేనె

తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. గోరువెచ్చని నీటిలో ఒక కప్పు తేనె కలిపి, అందులో 20 నిమిషాలు పాదాలను నానబెట్టండి. తర్వాత పాదాలను తుడుచుకోండి.

Telugu

బాదం నూనె, షియా బటర్

బాదం నూనె, షియా బటర్‌లను కలిపి పాదాలకు రోజుకి రెండుసార్లు పట్టించండి. ఇది పాదాలకు పోషణనిస్తుంది, పగుళ్లను మాన్పుతుంది.

Telugu

గ్లిజరిన్, గులాబీజలం

గ్లిజరిన్, గులాబీజలం కలిపి పాదాలకు రోజుకి రెండుసార్లు పట్టించండి. ఇది పాదాలను మృదువుగా చేస్తుంది.

Telugu

కలబంద గుజ్జు

కలబంద గుజ్జులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, హీలింగ్ గుణాలుంటాయి. దీన్ని పాదాలకు రాసి రాత్రంతా ఉంచి, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి.

Telugu

నిమ్మ, పంచదార స్క్రబ్

నిమ్మరసం, పంచదార కలిపి స్క్రబ్ చేసి పాదాలకు రుద్దాలి. 5 నిమిషాల తర్వాత కడగాలి. ఇది చర్మపు పగిలిన పొరలను తొలగిస్తుంది.

Telugu

అరటిపండు గుజ్జు

పండిన అరటిపండు గుజ్జును పాదాలకు పట్టించి 5-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది పాదాలను మృదువుగా చేస్తుంది.

Telugu

ఓట్ మీల్, జొజొబా నూనె

ఓట్ మీల్, జొజొబా నూనెలను కలిపి పేస్ట్‌లా చేసి పాదాలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడగాలి. ఇది పాదాలను మృదువుగా చేస్తుంది.

ఈ చిట్కాలతో మీ జట్టు ఎప్పటికీ తెల్లబడదు !

కురుక్షేత్రంలో ఎవరి రథం గాల్లో ప్రయాణించేదో తెలుసా?

పాలు తాగిన తర్వాత ఇవి మాత్రం తినకూడదు

రిపబ్లిక్ డే : ట్రైకలర్ లో బ్రేక్ ఫాస్ట్ లు చూస్తారా?