కోడిగుడ్లను పగలగొట్టాక పెంకులను శుభ్రం చేయండి. పెంకు పైభాగాన్ని జాగ్రత్తగా కట్ చేసి, వాటిని చిన్న చిన్న ప్లాంటర్లుగా మార్చుకోవచ్చు.
Image credits: AI
Telugu
హ్యాంగింగ్ డెకరేషన్
గుడ్డు పెంకులను హ్యాంగింగ్ డెకరేషన్‌గా వాడుకోవచ్చు. ఒక తాడు తీసుకుని దానికి రంగులు వేసిన గుడ్డు పెంకులను అక్కడక్కడా కట్టండి. చివర్లో ఒక చిన్న గంటను వేలాడదీయండి.
Image credits: Pinterest
Telugu
ఎగ్ షెల్ క్రియేటివ్ ఆర్ట్
నాటు కోడిగుడ్డు పెంకుల రంగు ముదురుగా ఉంటుంది. వాటితో ఇలా చిన్న చీమ బొమ్మను కూడా తయారు చేసి టేబుల్‌పై పెడితే మంచి ఎస్తెటిక్ లుక్ వస్తుంది.
Image credits: Instagram
Telugu
ఎగ్ ట్రేతో క్రియేటివ్ ఆర్ట్
గుడ్లు తెచ్చే అట్టపెట్టెను కూడా వాడుకోవచ్చు. ఇది కార్డ్‌బోర్డ్‌తో తయారవుతుంది. దీన్ని క్యూట్ తాబేలుగా మార్చుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
క్యాండిల్ డెకరేషన్‌గా అదరగొట్టండి
ఒక పొడవాటి గ్లాసులో క్యాండిల్ పెట్టండి. దాని చుట్టూ చిన్నవి, పెద్దవి గుడ్డు పెంకులను ఒకదానికొకటి అతికించండి. వాటి మధ్యలో చిన్న చిన్న పువ్వులు పెడితే సరి.
Image credits: Instagram
Telugu
ఫ్లవర్ వాజ్‌లో ఇలా అమర్చండి
చిన్న చిన్న గుడ్డు పెంకులకు రంగులు వేసి, వాటిపై చుక్కలు పెట్టండి. వాటికి కింద వైపున పుల్లను అంటించి ఏదైనా ఫ్లవర్ వాజ్‌లో పెడితే చూడటానికి చాలా బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
పెంకు ముక్కలతో ఆర్ట్
గుడ్డు పెంకులను చిన్న ముక్కలుగా పగలగొట్టండి. ఇప్పుడు ఒక షీట్‌పై కుందేలు లేదా మరేదైనా జంతువు బొమ్మ గీసి, దానిపై ఈ చిన్న పెంకు ముక్కలను అంటించవచ్చు.