Food
పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే పండు స్ట్రాబెర్రీ. ఇది చూడటానికి అందంగా, రుచిగా ఉంటుంది.
స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది.
హార్ట్ షేప్ లో ఉండే స్ట్రాబెర్రీ గుండెను కాపాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్ట్రాబెర్రీ చాలా మంచిది.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీ రోగనిరోధక శక్తికి, గుండె ఆరోగ్యానికి మంచిది.
ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యం. ఇది శిశువు మెదడు అభివృద్ధికి చాలా మంచిది.
కీళ్ల నొప్పుల సమస్యలను నివారించడానికి స్ట్రాబెర్రీ మంచిది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కీళ్లలో వాపును తగ్గిస్తాయి.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
రక్తపోటును నియంత్రించడానికి స్ట్రాబెర్రీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్ట్రాబెర్రీలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.