ఉల్లిపాయల్ని ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్లలో ఉంచకండి. సంచిలో పెట్టి కట్టేయకండి. గాలి బాగా తగిలే బుట్టలో లేదా నెట్ బ్యాగ్‌లో వేయండి.
ఉల్లిపాయల్ని తేమకు దూరంగా ఉంచండి. అలాగే ఎండ తగిలే ప్రదేశంలో పెట్టకండి. చల్లగా, పొడిగా, చీకటిగా ఉండే చోట పెడితేనే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
ఉల్లిపాయల్ని ఇతర పండ్లు లేదా కూరగాయలతో కలిపి నిల్వ చేయకూడదు. అలా చేస్తే ఆ కూరగాయలు, ఉల్లిపాయలు కూడా త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.
ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. తేమ వల్ల అవి ఉల్లిపాయలు మెత్తబడి బూజు పడతాయి.
ఉల్లిపాయ పైన ఉండే తొక్కను తీసేయకండి. ముందుగానే పొట్టు తీసి లేదా కడిగి పెట్టొద్దు. వంట చేసేటప్పుడు మాత్రమే తొక్క తీయండి.
కొనేటప్పుడే బాగా ఎండిన, గట్టిగా ఉండే ఉల్లిపాయలు ఎంపిక చేసుకోవాలి. అవే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
ఉల్లిపాయల తరుగును ఎక్కువ కాలం ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు, ఉల్లిపాయలు ఎప్పటికప్పుడు కట్ చేసి వండితేనే రుచిగా ఉంటాయి.
Curd Hair Packs: పెరుగుతో జుట్టు ఇలా బలంగా పొడవుగా పెంచుకోవచ్చు
Sharbat: నిమ్మకాయ లేకుండా కమ్మని షర్బత్ ఇలా చేసేయండి..!
Kewra Plant: పాములకు ఈ మొక్కంటే ప్రాణం.. కానీ ఆ సమస్యకు ఇదే రామబాణం!
Gold Rings: 2 గ్రాముల్లో స్టైలిష్ కొరియన్ ఉంగరాలు