Lifestyle

హెల్మెట్ పెట్టుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Image credits: Getty

హెల్మెట్ తప్పనిసరి

సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి. ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర గాయాల నుండి హెల్మెట్ రక్షణ కల్పిస్తుంది. హెల్మెట్ లేకుండా టూవీలర్ నడపడం నేరం, జరిమానా కూడా విధిస్తారు.

Image credits: Getty

హెల్మెట్ వాడేవారు గమనించండి

అయితే ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటే కొన్ని సమస్యలు తప్పవు. అవేంటో తెలుసుకుందాం.

Image credits: Getty

జుట్టు రాలిపోవడం

చాలా సార్లు జుట్టు రాలిపోవడానికి హెల్మెట్ ఒక ముఖ్య కారణం అవుతుంది.

Image credits: Getty

జాగ్రత్తపడితే రక్షణ

తల మొత్తం కప్పేసి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, తలకు చెమట ఎక్కువగా పడుతుంది. ఈ తేమ వల్ల తలలో దురద, తామర వంటివి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల జుట్టు రాలిపోతుంది.

Image credits: Getty

హెల్మెట్ ఇలా దాచండి

వాడిన తర్వాత హెల్మెట్ ఎప్పుడూ గాలి తగిలే చోట పెట్టాలి. దీనివల్ల తలలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది.

Image credits: Getty

హెల్మెట్ తీసేయండి

దూర ప్రయాణాలు చేసేటప్పుడు, మధ్యలో బైక్ ఆపి హెల్మెట్ తీసేయండి. దీనివల్ల చెమట పట్టకుండా ఉంటుంది.

Image credits: Getty

తువ్వాలతో తల కప్పుకోండి

హెల్మెట్ పెట్టుకునే ముందు జుట్టుని ఒక కాటన్ క్లాత్ తో కప్పుకోవడం మంచిది. దీనివల్ల జుట్టు రాలిపోవడం కొంతవరకు తగ్గుతుంది.

Image credits: Getty

జుట్టు పొడిబారకుండా

జుట్టు పొడిబారకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే హెల్మెట్ కి, జుట్టుకి మధ్య రాపిడి ఎక్కువై జుట్టు రాలిపోతుంది.

Image credits: Getty

టైట్ హెల్మెట్ వద్దు

చాలా టైట్ గా ఉన్న హెల్మెట్ పెట్టుకోకండి. జుట్టు బాగా బిగించి కట్టిన తర్వాత హెల్మెట్ పెట్టుకోకండి. జుట్టు వదులుగా ఉండనివ్వండి.

Image credits: Getty

జిడ్డు తగ్గించండి

హెల్మెట్ లో జిడ్డు పట్టకుండా చూసుకోండి. తరచూ హెల్మెట్ శుభ్రం చేసుకోండి. తడి జుట్టుతో హెల్మెట్ పెడితే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

Image credits: Getty

శుభ్రమైన నీరు, షాంపూ

శుభ్రమైన నీటితో తలస్నానం చేయడం, తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూ వాడటం వల్ల తలలో దుమ్ము, తామర తగ్గుతాయి.

Image credits: Getty
Find Next One