Lifestyle
పిల్లలకు పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయి. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. గోరువెచ్చని పాలలో కొంచెం పసుపును వేయండి. ఈ పాలు మీ పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
పాలలో బాదం, కుంకుమపువ్వును కలిపి కూడా పిల్లలకు ఇవ్వొచ్చు. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మీ పిల్లల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
దానిమ్మలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది పెద్దలకే కాదు చిన్న పిల్లల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దానిమ్మ జ్యూస్ తాగితే మీ పిల్లల ఎదుగుదల బాగుంటుంది.
పిల్లలు స్ట్రాబెర్రీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. స్ట్రాబెర్రీ, కివిలతో కలిపి జ్యూస్ ను తయారుచేసి పిల్లలకు ఇవ్వడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండి పిల్లలకు క్రమం తప్పకుండా ఇచ్చినా పిల్లలు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ వాటర్ మీ పిల్లల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
బీట్ రూట్, క్యారెట్, అల్లంతో తయారుచేసిన జ్యూస్ కూడా పిల్లల ఆరోగ్యానికి మంచిది. అయితే దీంట్లో చక్కెర వేయకూడదు. ఈ జ్యూస్ మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మిరియాలు, అల్లం, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు వంటి మసాలా దినుసులతో తయారు చేసిన మసాలా టీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ చిట్కాలను డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఫాలో అవ్వండి