జామపండ్లు మన శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే వీటిని ఈ చలికాలంలో తింటే జలుబు చేసే అవకాశం ఉంది.
Image credits: Getty
జీర్ణ సమస్యలు
జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే చలికాలంలో పీచు ఎక్కువగా ఉండే పండ్లను ఎక్కువగా తింటే గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
Image credits: Getty
సున్నితమైన దంతాలు
కొందరికి చల్లని వాతావరణంలో జామపండ్లను లేదా ఇతర చల్లని పండ్లను తినడం వల్ల దంతాల సున్నితత్వం సమస్య రావొచ్చు. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
Image credits: Getty
తక్కువ లభ్యత
కొన్ని ప్రాంతాలలో.. జామపండ్లు చలికాలంలో అంత సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు. లేదా తాజాగా ఉండకపోవచ్చు. ఈ సీజన్ లో నాణ్యమైన పండ్లు దొరకడం చాలా కష్టం.
Image credits: Getty
రోగనిరోధక ఆరోగ్యంపై ప్రభావం
మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి జామపండులో పుష్కలంగా ఉంటుంది. అయినప్పటికీ.. చలికాలంలో జామపండ్లను ఎక్కువగా తింటే ప్రయోజనం పొందకపోవచ్చు.
Image credits: Getty
వెచ్చని ఆహారాలకు ప్రాధాన్యత
చలికాలంలో జనాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి వెచ్చని ఆహారాలు, పానీయాలను తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాగే ఈ సీజన్‌లో జామ వంటి చల్లని పండ్లకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది.