Lifestyle

నల్ల ద్రాక్ష

నల్ల ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం మెండుగా ఉంటాయి. సాధారణంగా నల్ల ద్రాక్షను వైన్, జ్యూస్, జామ్, జెల్లీ తయారీకి ఉపయోగిస్తారు.
 

Image credits: Getty

నల్ల ద్రాక్ష

నల్ల ద్రాక్షలో విటమిన్ సి తో పాటుగా విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు విటమిన్లు శరీర మంటను తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

ఆకలిని తగ్గిస్తుంది

నల్ల ద్రాక్షలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన ఆకలిని తగ్గించడానికి, ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

గుండె జబ్బులు

నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 

Image credits: Getty

ఇమ్యూనిటీ పవర్

నల్ల ద్రాక్షలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఈ విటమిన్ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. 
 

Image credits: Getty

క్యాన్సర్

నల్ల ఎండుద్రాక్షలో రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Getty

కొలెస్ట్రాల్

నల్ల ద్రాక్షలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే సమ్మేళనాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Image credits: Getty
Find Next One