Lifestyle

సిట్రిస్ పండ్లు

సిట్రస్ పండ్లైన నిమ్మ, నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు ఇనుము శోషణను పెంచడానికి, రక్తహీనతను పోగొట్టడానికి సహాయపడతాయి.

Image credits: Getty

బీట్రూట్

బీటురూట్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఫైబర్ మెండుగా ఉంటాయి. వీటిని తింటే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. 
 

Image credits: Getty

దానిమ్మ

దానిమ్మ పండులో ఐరన్, కాల్షియం, విటమిన్ సి తో పాటుగా ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడుతాయి.
 

Image credits: Getty

ఖర్జూరాలు

ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి ఖర్జూరాలను తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
 

Image credits: Getty

పప్పు

పప్పు కూడా మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే చిక్కుళ్లను తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
 

Image credits: Getty

బచ్చలికూర

ఆకు కూరలు ఇనుము, పొటాషియం, విటమిన్ కె,  విటమిన్ బి కి మంచి మూలం. అందుకే బచ్చలికూర వంటి ఆకుకూరలను తింటే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. 
 

Image credits: Getty

గుడ్డు

ఇనుము, ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లను తింటే కూడా రక్తహీనత సమస్య తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. గుడ్డు మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. 

Image credits: Getty
Find Next One