Lifestyle

హెయిర్ ఫాల్

జుట్టు రాలడమనేది స్త్రీ పురుషులు ఇద్దరూ ఎదుర్కొనే అత్యంత సర్వ సాధారణ సమస్యల్లో ఒకటి. వెంట్రుకలు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. 
 

Image credits: our own

ఆహారాలు

ఆరోగ్యకరమైన ఆహారాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి. ఇందుకోసం ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image credits: our own

వాల్ నట్స్

వాల్ నట్స్ లో విటమిన్ బి1, బయోటిన్, విటమిన్ బి6 లతో పాటుగా ప్రోటీన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. 
 

Image credits: Getty

బచ్చలికూర

జుట్టు రాలడాన్ని నివారించడానికి బచ్చలికూర కూడా ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

Image credits: Getty

గుడ్డు పచ్చసొన

గుడ్డు పచ్చసొన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గుడ్డులో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. 
 

Image credits: Getty

చిలగడదుంప

చిలగడదుంప మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఇది మన జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. 
 

Image credits: our own

వేరుశెనగ

వేరుశెనగ, జీడిపప్పు, బాదం, వాల్ నట్స్  లు పోషకాలకు మంచి వనరు. వీటిని రోజూ గుప్పెడు తింటే మీ జుట్టు ఊడటం ఆగి పొడుగ్గా పెరుగుతుంది. 
 

Image credits: our own
Find Next One