Lifestyle

కివీ పండు

ఆరోగ్యకరమైన పండ్లలో కివీ ఒకటి. ఈ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
 

Image credits: Getty

అధిక రక్తపోటు

కివీ పండులో అధిక రక్తపోటును తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. ఈ పండును తింటే హైబీపీ నార్మల్ అవుతుంది.
 

Image credits: Getty

గుండె జబ్బులు

కివీ పండును తింటే గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Image credits: Getty

మలబద్ధకం

కివీ పండులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడానికి, జీర్ణసమస్యలు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

డైటరీ ఫైబర్

100 గ్రాముల కివీ పండులో 3 గ్రాముల డైటరీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కివీలో కరిగే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty

క్యాన్సర్లు

కివీ పండులోని ఫైబర్స్ తో పాటుగా ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఇవి కడుపు, ప్రేగు, పెద్దప్రేగు క్యాన్సర్లను నివారించడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty

మెరుగైన నిద్ర

కివీ పండులో సెరోటోనిన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

Image credits: Getty
Find Next One