Health

వ్యాయామం లేకపోవడం

సంవత్సరాల తరబడి వ్యాయామం చేయకుండా ఉంటే కాలేయ వ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే రోజుకు కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. 
 

Image credits: Getty

తీపి పదార్థాలు

తీపి ఆహారాలను ఎక్కువగా తినకూడదు. దీనివల్ల కాలెయ సమస్యలు వస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు కృత్రిమంగా తియ్యటి వంటకాలు లేదా పానీయాలను తీసుకోకండి. 
 

Image credits: Getty

ఆల్కహాల్

కాలేయ వ్యాధికి దారితీసే ప్రధాన కారకాల్లో ఆల్కహాల్ ఒకటి. ముఖ్యంగా ఆల్కహాల్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల  కాలెయ వ్యాధులు వస్తాయి. అందుకే మందును ఎక్కువగా తాగకూడదు. 
 

Image credits: Getty

ధూమపానం

ఆల్కహాల్ తో పాటుగా ధూమపానం కూడా కాలేయ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీకు కాలెయ వ్యాధులు రావొద్దంటే స్మోకింగ్ తో పాటుగా ఇతర మారకద్రవ్యాల వాడకాన్ని మానుకోండి. 
 

Image credits: Getty

నిద్ర

నిద్రకూడా కాలెయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఇది మీ కాలెయాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Image credits: Getty

బరువు

ఊబకాయం కూడా కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వయస్సు, ఎత్తు , ఆరోగ్య స్థితిని బట్టి మీ శరీర బరువును ఉంచడానికి ప్రయత్నించండి.
 

Image credits: Getty

వ్యాక్సిన్

హెపటైటిస్-బి వ్యాక్సిన్ తీసుకోని వారికి కూడా కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ వ్యాక్సిన్ ను తీసుకోండి. 

Image credits: Getty

మీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి

వీటిని తినకండి లేదంటే గుండె జబ్బులొస్తయ్

మీ గుండె ప్రమాదంలో ఉంటే ఇలా అవుతుంది.. గమనించారా?

ఈ మసాలా దినుసులు బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తయ్..