Lifestyle

కంటి నొప్పి

ఫోన్ ను మితిమీరి వాడే వారికి ఎన్నో సమస్యలొస్తయ్. అందులో మొదటిది కంటి నొప్పి. అవును గంటల తరబడి ఫోన్ ను చూడటం వల్ల కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. 

Image credits: Getty

నిద్ర సమస్యలు

ఫోన్ బ్లూ లైట్ మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. ఇది కంటిచూపును తగ్గించడమే కాకుండా మనకు నిద్రరాకుండా చేస్తుంది. రాత్రిపూట ఎక్కువగా ఫోన్ ను చూడటం వల్ల నిద్ర సరిగ్గా రాదు. 

Image credits: Getty

మెడ, వెన్ను నొప్పి

కంఫర్ట్ గా లేని పొజీషన్ లో కూర్చొని లేదా, పడుకుని ఫోన్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల కూడా మెడ నొప్పి, వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 
 

Image credits: Getty

ఒత్తిడి

ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఫోన్ ను ఎక్కువగా సేపు చూస్తే కూడా ఒత్తిడికి గురవుతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

Image credits: Getty

వ్యాయామం లేకపోవడం

ఫోన్ ను ఎక్కువ సేపు యూజ్ చేయడం వల్ల వ్యాయామం చేయరు. కానీ శారీరక శ్రమ లేకపోవడం వల్ల మీరు విపరీతంగా బరువు పెరగడమే కాకుండా వేరే సమస్యలు కూడా వస్తాయి. 
 

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

ఫోన్ పైనే ఎక్కువగా ఆధారపడటం.. ఫోన్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంత మంచిది కాదు. దీనివల్ల మీ మెదడు పనితీరు దెబ్బతింటుంటి. 
 

Image credits: Getty

సమాజానికి దూరంగా..

ఫోన్ లోనే ఎక్కువ సమయం గడపడం వల్ల మీకు ఇతరులతో ఇంటరాక్షన్ తగ్గుతుంది. ఇది మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉంచుతుంది. ఇది మిమ్మల్ని డిప్రెషన్ బారిన పడేస్తుంది. 
 

Image credits: Getty
Find Next One