Lifestyle

గుండె ఆరోగ్యం

బీట్ రూట్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి బీట్ రూట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 

Image credits: Getty

డయాబెటిస్

బీట్ రూట్ డయాబెటీస్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty

జీర్ణక్రియ

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే బీట్ రూట్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు.
 

Image credits: Getty

కాలేయ ఆరోగ్యం

కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండటానికి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బీట్ రూట్ ను ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాలెయ సమస్యలు రాకుండా చూస్తుంది.
 

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

బీట్ రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పనితీరు మెరుగుపడుతుంది. 
 

Image credits: Getty

రక్తహీనత

బీట్ రూట్ ఇనుము అద్భుతమైన మూలం. అందుకే ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

బీట్ రూట్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు కూడా దీనిలో తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బీట్ రూట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గ్లో కూడా అవుతుంది. 

Image credits: Getty

కొత్తిమీరను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

ఈ పండ్లను తింటే బరువు తగ్గుతారా?

సరిగ్గా నిద్రపోకపోతే ఇన్ని సమస్యలొస్తాయా?

కుక్కలను పెంచుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..