మన మూడ్ ను మెరుగుపరిచే గుణం కొత్తిమీరకు ఉంటుంది. అందుకే మూడ్ డిజార్డర్ ఉన్నవారికి కొత్తిమీర ఆకులు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి.
life Jan 11 2024
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
చర్మ ఆరోగ్యం
కొత్తిమీర మన శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపే ప్రక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల మీ చర్మం అందంగా కనిపిస్తుంది. గ్లో అవుతుంది.
Image credits: Getty
Telugu
బరువు తగ్గడానికి
బరువు తగ్గాలనుకునేవారు కూడా కొత్తిమీరను డైట్ లో చేర్చుకోవచ్చు. దీనిలో కేలరీలు అసలే ఉండవు. అంతేకాక ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
Image credits: Getty
Telugu
ఇమ్యూనిటీ
కొత్తిమీర ఆకులు మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఇది వ్యాధులతో పోరాడటానికి మనకు సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
జీర్ణప్రక్రియ
కొత్తిమీర ఆకులు జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడానికి కూడా సహాయపడతాయి. కొత్తిమీరను తింటే గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యం
కొత్తిమీర ఆకులు కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే దీన్ని రెగ్యులర్ గా తింటే మీ గుండెకు ఎలాంటి ముప్పు ఉండదు.
Image credits: Getty
Telugu
చక్కెర స్థాయిలు
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా కొత్తిమీర ఆకులు సహాయపడతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు కూడా దీన్ని తినొచ్చు.