Lifestyle

వర్షాకాలంలో కర్లీ హెయిర్ కేర్ టిప్స్

Image credits: Pexels

రోజూ తలస్నానం వద్దు

అతిగా జుట్టును కడగడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయ. దీనివల్ల మీ జుట్టు, పొడిగా మారుతుంది. అందుకే అవసరమైనప్పుడు మాత్రమే మీ జుట్టును వాష్ చేయడానికి ప్రయత్నించండి.
 

Image credits: Pexels

చిక్కులు జాగ్రత్తగా తీయండి

కర్లీ హెయిర్ చిక్కులు ఎక్కువగా పడుతుంది. అందుకే చిక్కులు తీసేటప్పుడు సున్నితంగా దువ్వాలి. చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్లున్న దువ్వునను ఉపయోగించండి. 
 

Image credits: Pexels

లీవ్ ఇన్ కండీషనర్

తడి జుట్టుకు లీవ్-ఇన్ కండీషనర్ లేదా కర్ల్-డిఫైనింగ్ క్రీమ్‌ను ను అప్లై చేయాలి. ముఖ్యంగా చివర్లు, మధ్యను బాగా అప్లై చేయాలి. ఇది మీ జుట్టును తేమగా ఉంచుతుంది. 

Image credits: Pexels

హీట్ స్టైలింగ్‌ వద్దు

వర్షాకాలంలో మీ జుట్టును హెయిర్ డ్రయ్యర్ ద్వారా ఆరబెట్టడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ జుట్టును పొడిబారేలా చేస్తుంది. అందుకే మీకు వీలైనప్పుడల్లా నెత్తిని గాలికే ఆరనివ్వండి.
 

Image credits: Pexels

రెగ్యులర్ ట్రిమ్

వర్షాకాలంలో పెరిగిన తేమ, పర్యావరణ కాలుష్యం కారణంగా జుట్టు చివర్లు చీలిపోవడం సర్వసాధారణం. అయితే మీ కర్లీ హెయిర్ ను సరైన ఆకృతిలో ఉంచడానికి రెగ్యులర్ ట్రిమ్‌లను షెడ్యూల్ చేయండి.
 

Image credits: Pexels

హైడ్రేటెడ్ గా ఉండండి, పోషకాహారం తినండి

నీటిని పుష్కలంగా తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండండి. బయోటిన్, విటమిన్ A,విటమిన్ C, విటమిన్ D,విటమిన్ E,ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Pexels

గ్యాస్ తో కడుపు ఉబ్బిపోయిందా? వీటిని తినండి తగ్గిపోతుంది

పెసర్ల పిండితో ఈ చర్మ సమస్యలన్నీ మాయం..!

చంకల్లో చర్మం నల్లగా ఉందా? ఇలా చేస్తే నలుపు మాయం..!

మధ్యాహ్నం తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవి..