Lifestyle
బ్రోకలీని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. దీనిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కంటెంట్ పుష్కంగా ఉంటాయి.
బ్రోకలిలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎన్నో రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
బ్రోకలీలో బీటా కెరోటిన్ , ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయ ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధిస్తుంది. తగ్గించడానికి సహాయపడుతుంది.
బ్రోకలీలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కవ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి బ్రోకలీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
బ్రోకలీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే ప్రేగు కదలికలకు మద్దతునిస్తుంది.
బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపు పూతల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రోకలీలో విటమిన్ కె, కాల్షియం, ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకల సమస్యలను తగ్గిస్తాయి.
బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది మొత్తం ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.