Lifestyle

మలబద్ధకం

బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండును పరిగడుపున తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండును పరిగడుపున తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 

Image credits: Getty

కళ్ల ఆరోగ్యం

బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండే బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

Image credits: Getty

కొలెస్ట్రాల్

ఈ పండులో ఫ్యాటీ యాసిడ్స్, ఒలేయిక్ యాసిడ్స్, ఫైబర్ మొదలైనవి కూడా ఉంటాయి. ఇవన్నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

విటమిన్ కె పుష్కలంగా ఉండే బొప్పాయి తింగే ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. 

Image credits: Getty

బరువు తగ్గడానికి

ఫైబర్ కంటెంట్ మెండుగా ఉండే పచ్చి బొప్పాయిని మీ డైట్ లో చేర్చుకుంటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

బొప్పాయిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ లు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

Image credits: Getty
Find Next One