Lifestyle

నారింజ పండ్లు మనకు చేసే మేలు..

Image credits: google

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

నారింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను తింటే చెడు కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. అలాగే మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 

Image credits: google

ఇమ్యూనిటీ పవర్

విటమిన్ సికి గొప్ప వనరులు నారింజ పండ్లు. ఈ పండ్లను తింటే మన రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లు శరీరంలో ఇనుము శోషణను పెంచి రక్తహీనతను నివారించడానికి సహాయపడతాయి. 
 

Image credits: google

విటమిన్ సి

నారింజలో విటమిన్ సి తో పాటుగా ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 
 

Image credits: google

క్యాన్సర్ల నుంచి రక్షణ

నారింజ పండ్లను రెగ్యులర్ గా తింటే కొన్ని రకాల  క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

Image credits: google

కాల్షియం

నారింజ పండ్లలో కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఇది మన ఎముకలను, కండరాలను బలంగా చేస్తుంది. ఎముకల సమస్యలొచ్చే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

Image credits: google

అధిక రక్తపోటు

నారింజ పండ్లను తిన్నా కూడా అధిక రక్తపోటు తగ్గిపోతుంది. ఎందుకంటే దీనిలో హైబీపీని తగ్గించే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 
 

Image credits: google

జుట్టు రాలడం తగ్గుతుంది

నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Find Next One