Lifestyle

మలబద్ధకం

బార్లీ వాటర్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే అజీర్ణం నుంచి మలబద్దకం వరకు ఎన్నో సమస్యలు ఇట్టే నయమవుతాయి. 
 

Image credits: Getty

నిర్జలీకరణం

బార్లీ  వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, నిర్జలీకరణాన్ని నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. డీహైడ్రేషన్ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది.
 

Image credits: Getty

మూత్రపిండాల ఆరోగ్యం

బార్లీ వాటర్ ను తాగితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్ వంటి ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

రక్తపోటు, కొలెస్ట్రాల్

అధిక రక్తపోటును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బార్లీ వాటర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీళ్లను రోజూ తాగితే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 
 

Image credits: Getty

డయాబెటిస్

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే బార్లీ వాటర్ కూడా డయాబెటిస్ ను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. బార్లీ వాటర్ లో  గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది.
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

ఆకలిని నియంత్రించడానికి, బరువు పెరగడాన్ని తగ్గించడానికి బార్లీ వాటర్ ను రోజూ తాగండి. ఈ వాటర్ మీ ఆకలిని తగ్గించి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బార్లీ వాటర్ ను క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యం ఉంటుంది. చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఏం తినాలి?

శరీరంలో రక్తాన్ని పెంచే ఆహారాలు ఇవి..!

ఒంట్లో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుందంటే?

కివీ పండుగను రోజూ తింటే ఇంత మంచిదా?