Lifestyle
చిలగడదుంపల్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిని రెగ్యులర్ గా తినడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఫోలేట్, జింక్, ఐరన్ లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలను మీ ఆహారంలో చేర్చడం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది.
గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్ బి, బయోటిన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ జుట్టు బాగా పెరుగుతుంది.
రోజూ గుప్పెడు గింజలను తింటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. నట్స్ లో జింక్, ఐరన్, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తుగా పెరుగుతుంది.
విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే అవొకాడోలను తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యంగానూ ఉంటుంది.
ప్రోటీన్, బి విటమిన్లు, కాల్షియం పుష్కలంగా ఉన్న పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రోజూ పెరుగును తిన్నా జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.