Lifestyle

ప్రోటీన్ పుష్కలం

పచ్చి బఠానీల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల పచ్చి బఠానీల్లో సుమారు ఐదు గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది.
 

Image credits: Getty

జీర్ణక్రియ

పచ్చి బఠానీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. అజీర్థి వంటి జీర్ణ సమస్యలు కూడా రావు.
 

Image credits: Getty

డయాబెటిస్

మధుమేహులకు పచ్చి బఠానీలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
 

Image credits: Getty

వెయిట్ లాస్

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే బఠానీలను తింటే ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు హెవీగా తినరు. ఫలితంగా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

Image credits: Getty

రక్తపోటు

పచ్చి బఠానీల్లో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. హైబీపీ పేషెంట్లు పచ్చి బఠానీలను తింటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

పచ్చి బఠానీలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వీటిని తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

పచ్చి బఠానీల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో మీరు ఎలాంటి రోగాలు లేకుండా ఉంటారు. 
 

Image credits: Getty

కంటి ఆరోగ్యం

పచ్చి బఠానీలను రెగ్యులర్ గా తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. 

Image credits: Getty
Find Next One