Lifestyle

మధుమేహం తగ్గాలంటే

మధుమేహులు కాకరకాయ జ్యూస్ ను కూడా తాగొచ్చు. ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే కొన్ని మినరల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

బ్లడ్ షుగర్

కాకరకాయ జ్యూస్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఎతో పాటుగా విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. 
 

Image credits: others

పోషకాలు

కాకరకాయ జ్యూస్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఈ జ్యూస్ లో పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 

Image credits: Getty

ఇమ్యూనిటీ

కాకరకాయను తిన్నా.. దీన్ని జ్యూస్ గా తాగినా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీకు అంటువ్యాధులు, ఇతర రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Image credits: others

మలబద్ధకం

ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్దకంతో బాధపడుతున్నారు. అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కాకరకాయలు మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడతాయి.
 

Image credits: others

బరువు తగ్గడం

కాకరకాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి  కూడా వీటిని మీ డైట్ లో చేర్చుకోవచ్చు. 100 గ్రాముల కాకరకాయలో కేవలం 17 కేలరీలు మాత్రమే ఉంటాయి.
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

కాకరకాయలు మన గుండెను ఆరోగ్యంగా ఉండానికి కూడా సహాయపడతాయి. కాకరకాయ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

వైట్ చాక్లెట్ ను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

రక్తపోటును తగ్గించే చిట్కాలు

తులసి నీటిని రోజూ తాగడం అలవాటు చేసుకుంటే మీకు ఈ సమస్యలే రావు..!

చిలగడదుంపలను రోజూ తింటున్నరా?